alt="Page 1">
-
2025-12-06 - Viswa Bhavisyath
alt="Page 1">
-
2025-10-02 - Viswa Bhavisyath
Karur stampede: కరూర్ తొక్కిసలాటపై ఫేక్ న్యూస్.. యూట్యూబర్ అరెస్ట్

By Viswabhavishyth .Team
Published By 30 Sep 2025 time :10:57
Karur stampede: కరూర్ తొక్కిసలాటపై ఫేక్ న్యూస్.. యూట్యూబర్ అరెస్ట్
ఇంటర్నెట్ డెస్క్: సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట (Karur stampede) లో మృతుల సంఖ్య 41కి పెరిగింది. ఈ ఘటనపై చర్యలు చేపట్టిన పోలీసులు తాజాగా ఓ యూట్యూబర్ను అరెస్టు చేశారు. విజయ్ ర్యాలీలో జరిగిన ప్రమాదంపై నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న తమిళనాడు యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ (YouTuber Felix Gerald)ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రెడ్పిక్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్న జెరాల్డ్ తొక్కిసలాట ఘటనకు సంబంధించినదని చెబుతూ.. నకిలీ కంటెంట్ను తన ఛానల్లో ప్రచారం చేశారు.
టీవీకే పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టేలా జెరాల్డ్ నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు (Spreading Fake News) ఫిర్యాదులు అందడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకు మరో 25 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. వారందరినీ కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. ప్రజాశాంతికి భంగం కలిగించే, ఉద్రిక్తతలను రేకెత్తించేలా సోషల్ మీడియాలో కంటెంట్ షేర్ చేస్తున్నందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కరూర్ మృతులు.. 41 మంది
కరూర్ విజయ్ ప్రచార సభలో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసులు కరూర్ జిల్లా టీవీకే కార్యదర్శి మదియళగన్ను సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ అరెస్టుకు కూడా పోలీసులు రంగం సిద్ధంచేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్ పేరు కూడా ఎఫ్ఎఆర్ లో ఉంది. విచారణాధికారిగా ఉన్న డీఎస్పీని తొలగించి ఆయన స్థానంలో అదనపు డిప్యూటీ ఎస్పీ(ఏడీఎస్పీ) ప్రేమానందనన్ను ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం కరూర్ తొక్కిసలాట (Karur stampede) కేసులో కొత్త దర్యాప్తు అధికారిగా నియమితులయ్యారు. మరోవైపు,