alt="Page 1">
-
2025-12-06 - Viswa Bhavisyath
alt="Page 1">
-
2025-10-02 - Viswa Bhavisyath
Trump Tariffs: ట్రంప్ మరో బాంబ్.. కలప, ఫర్నిచర్పై సుంకాలు

By Viswabhavishyth .Team
Published By 30 Sep 2025 time :10:57
Trump Tariffs: ట్రంప్ మరో బాంబ్.. కలప, ఫర్నిచర్పై సుంకాలు
ఇంటర్నెట్లెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి టారిఫ్ బాంబు పేల్చారు. అన్నట్టుగానే.. ఫర్నిచర్, కలపపై సుంకాల మోత మోగించారు.
ఇటీవల కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ పరికరాలతో పాటు అప్రోల్స్టర్డ్ ఫర్నిచర్, భారీ ట్రక్కులపై భారీ సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు తాజాగా కలప పై 10 శాతం, కిచెన్ క్యాబినెట్లు, అప్లర్డ్ ఫర్నిచర్పై 25 శాతం సుంకాలను తాజాగా విధించారు. ఇవి అక్టోబరు 14 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. చైనాతో సహా ఇతర దేశాల దిగుమతుల కారణంగా ఫర్నిచర్ వ్యాపారానికి కేంద్రస్థానంగా ఉండే అమెరికాలోని నార్త్ కరోలినా దాని ప్రాభవాన్ని కోల్పోయిందన్నారు. అమెరికాలో ఫర్నిచర్ తయారుచేయకపోతే భారీస్థాయిలో సుంకాలను విధిస్తామని ట్రూత్ సోషల్ లో హెచ్చరించారు. ఇక, సిమాలపై కూడా ట్రంప్ భారీగా సుంకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. యూఎస్ వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం అదనపు టారిఫ్లు విధిస్తానని ఆయన ప్రకటించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది.